మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Dhanyashtakam – ధన్యాష్టకం
తత్ జ్ఞానం ప్రశమకరం యదింద్రియాణాం
తత్ జ్ఞేయం యదుపనిషత్సునిశ్చితార్థమ్ |
తే ధన్యా భువి పరమార్థనిశ్చితేహాః
శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతః || 1 ||
ఆదౌ విజిత్య విషయాన్మదమోహరాగ-
ద్వేషాదిశత్రుగణమాహృతయోగరాజ్యాః |
జ్ఞాత్వా మతం సమనుభూయపరాత్మవిద్యా-
కాంతాసుఖం వనగృహే విచరంతి ధన్యాః || 2 ||
త్యక్త్వా గృహే రతిమధోగతిహేతుభూతా-
మాత్మేచ్ఛయోపనిషదర్థరసం పిబంతః |
వీతస్పృహా విషయభోగపదే విరక్తా
ధన్యాశ్చరంతి విజనేషు విరక్తసంగాః || 3 ||
త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే
మానావమానసదృశాః సమదర్శినశ్చ |
కర్తారమన్యమవగమ్య తదర్పితాని
కుర్వంతి కర్మపరిపాకఫలాని ధన్యాః || 4 ||
త్యక్త్వైషణాత్రయమవేక్షితమోక్షమర్గా
భైక్షామృతేన పరికల్పితదేహయాత్రాః |
జ్యోతిః పరాత్పరతరం పరమాత్మసంజ్ఞం
ధన్యా ద్విజారహసి హృద్యవలోకయంతి || 5 ||
నాసన్న సన్న సదసన్న మహన్న చాణు
న స్త్రీ పుమాన్న చ నపుంసకమేకబీజమ్ |
యైర్బ్రహ్మ తత్సమనుపాసితమేకచిత్తై-
ర్ధన్యా విరేజురితరే భవపాశబద్ధాః || 6 ||
అజ్ఞానపంకపరిమగ్నమపేతసారం
దుఃఖాలయం మరణజన్మజరావసక్తం |
సంసారబంధనమనిత్యమవేక్ష్య ధన్యా
జ్ఞానాసినా తదవశీర్య వినిశ్చయంతి || 7 ||
శాంతైరనన్యమతిభిర్మధురస్వభావై-
రేకత్వనిశ్చితమనోభిరపేతమోహైః |
సాకం వనేషు విదితాత్మపదస్వరుపం
తద్వస్తు సమ్యగనిశం విమృశంతి ధన్యాః || 8 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.